 
                                                            తిరువనంతపురం : సూడాన్ అల్లర్లలో శనివారం కేరళవాసి దుర్మరణం చెందారు. సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో సుడాన్ వాసులు 51 మంది కూడా మృత్యువాతపడ్డారు. మృతుడిని కేరళలోని కన్నూరు జిల్లా నెల్లిప్పరకు చెందిన అల్బర్ట్ అగస్టియన్ (48)గా గుర్తించారు.
సుడాన్ రాజధాని ఖర్తూమ్‌లోని భారత దౌత్యకార్యాలయం అల్బర్ట్ మరణాన్ని ధ్రువీకరించి ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆయన అక్కడి ఒక కంపెనీలో సెక్యూరిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
 
                            