రాయ్‌పూర్ : బీజాపూర్ జిల్లా సీల్గేర్ వద్ద వాగులో ఓ జవాన్ గల్లంతయ్యారు. కూంబింగ్‌కు వెళ్లి తిరిగొస్తూ వాగు దాటుతుండగా జవాన్ గల్లంతయ్యారు. గల్లంతైన జవాన్ సూరజ్ కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన జవాన్ సూరజ్ గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ వాగు సుక్మా – బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఇవాళ ఉదయం కూంబింగ్‌కు వెళ్లిన జవాన్లు తిరిగి వస్తుండగా.. సీల్గేర్ వద్ద సూరజ్ వాగు దాటేందుకు యత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి.