e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జాతీయం హోటల్‌ సిబ్బంది, కస్టమర్లను కొట్టిన ఎస్‌ఐ

హోటల్‌ సిబ్బంది, కస్టమర్లను కొట్టిన ఎస్‌ఐ

హోటల్‌ సిబ్బంది, కస్టమర్లను కొట్టిన ఎస్‌ఐ

చెన్నై: హోటల్‌లో ఫుడ్‌కు ఆర్డర్‌ చేసిన ఒక పోలీస్‌ అధికారి డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు కస్టమర్లను లాఠీతో కొట్టాడు. దీంతో ఆ హోటల్‌ యజమాని దీనిపై ఫిర్యాదు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఒక హోటల్‌కు వచ్చిన ఎస్‌ఐ ఫుడ్‌కు ఆర్డర్‌ ఇచ్చాడు. డబ్బులు అడిగినందుకు సిబ్బందితోపాటు హోటల్‌లో ఉన్న కస్టమర్లపై లాఠీతో కొట్టి బయటకు వెళ్లగొట్టాడు. ఈ క్రమంలో ఒక మహిళకు లాఠీ దెబ్బ తగలడంతో ఆమె ఏడ్చింది.

ఇదంతా హోటల్‌లోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీని ఆధారంగా ఆ ఎస్‌ఐపై హోటల్‌ యజమాని సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు లంచాల కోసం తమను వేధించడంతోపాటు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హోటల్‌ సిబ్బంది, కస్టమర్లను కొట్టిన ఎస్‌ఐ

ట్రెండింగ్‌

Advertisement