యూనిఫాంలో ఓ దివ్యాంగ విద్యార్థిని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు అలాగే గెంతుకుంటూ వెళ్తున్నది. ఈ వీడియో ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ కంటపడింది. త్వరలోనే ఆమెకు సహాయం చేయనున్నట్లు సోనూసూద్ ప్రకటించాడు.
ఓ రోడ్డుప్రమాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయిందని స్థానిక మీడియా పేర్కొంది. అయినా, చదువుకోవాలని ఆమె తపనముందు వైకల్యం ఓడిపోయింది. ఒంటికాలిపై గెంతుతూ తన లక్ష్యాన్ని సాధించేందుకు స్కూల్ బాటపట్టింది. ఆ విద్యార్థినికి చదువుపై ఉన్న శ్రద్ధ సోనూసూద్‌ను కట్టిపడేసింది. ‘ఇక నువ్వు స్కూల్‌కు ఒక కాలిపై గెంతుకుంటూ వెళ్లవు. టికెట్స్ పంపిస్తున్నా వచ్చేయ్.. నువ్వు రెండు కాళ్లపై చెంగుచెంగున స్కూల్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి సోనూసూద్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
अब यह अपने एक नहीं दोनो पैरों पर क़ूद कर स्कूल जाएगी।
टिकट भेज रहा हूँ, चलिए दोनो पैरों पर चलने का समय आ गया। @SoodFoundation 🇮🇳 https://t.co/0d56m9jMuA— sonu sood (@SonuSood) May 25, 2022