బాగల్కోట్: చంద్రయాన్-3పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై కర్ణాటకలో కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంస్థ నేతలు బాగల్కోట్ జిల్లాలోని బనహట్టి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చొక్కా, లుంగీతో ఉన్న ఒక వ్యక్తి టీ తిరగబోస్తున్న క్యారికేచర్‌ను ప్రకాశ్ రాజ్ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
చంద్రయాన్ నుంచి ఇప్పుడే వచ్చిన మొదటి ఫొటో అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చారు. దేశానికి గర్వకారణమైన చంద్రయాన్‌పై ఈ వ్యంగ్యమేంటంటూ విమర్శలు రావడంతో జోక్‌గానే దీన్ని పోస్టు చేశానని ఆయన పేర్కొన్నారు.