బీహార్‌లోని కుగ్రామం నర్హాట్లో జన్మించిన వికాస్ కుమార్ ‘మైనస్ డిగ్రీ’ కంపెనీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి, టైల్స్, ఫర్నిచర్, ట్రోఫీలు, పతకాలను తయారు చేస్తున్నారు. ఆయన తన సోదరుడు రాహుల్‌తో కలిసి ఈ వ్యాపారాన్ని రూ.1.25 కోట్ల టర్నోవర్‌కు అభివృద్ధి చేశారు.
టాటా మోటార్స్, ఐడీఎఫ్సీ బ్యాంక్, బీఎండబ్ల్యూ, అడిడాస్ వంటి పెద్ద సంస్థలు ఆయనకు వినియోగదారులుగా ఉన్నారు. వీరు తయారు చేసిన పతకాలు, పెన్ స్టాండ్స్, ఫర్నిచర్, ఇతర కళాఖండాలు రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. అమెరికా, సింగపూర్, జర్మనీ, తైవాన్, కెనడా వంటి దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు.