చామరాజ్నగర్, డిసెంబర్ 7: బడికి వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ దట్టమైన అడవి గుండా ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన దుస్థితి కాంగ్రెస్ (Congress) పాలిత కర్ణాటకలోని (Congress) చామరాజ్నగర్ జిల్లాలో నెలకొంది. పచ్చెదొడ్డి గ్రామానికి చెందిన విద్యార్ధులు బడికి (School Students) వెళ్లాలంటే మేల్ మహదేశ్వర హిల్స్ ఫారెస్ట్ రీజియన్లో పులులు, చిరుతలు, ఏనుగులు వంటి క్రూర మృగాలతో నిండి ఉన్న అడవి మార్గాన 7 కి.మీ నడుచుకుంటూ వెళ్లక తప్పదు.
గ్రామంలోని రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఇక్కడకు రవాణా సదుపాయం నిలిచిపోయింది. గతంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీపును కూడా రోడ్డు బాలేక ఆపేశారు. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు విద్యార్థులు లేఖ రాస్తూ తమ గ్రామానికి రోడ్డును వేయాలని విజ్ఞప్తి చేశారు.