కాస్గంజ్: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో 16 ఏండ్ల బాలిక గ్యాంగ్ రేప్‌కు గురైంది. బాలిక ఈ నెల 10న తనకు కాబోయే భర్తతో కలిసి కాస్గంజ్ జిల్లాలోని హజారా కెనాల్ పక్కన ఉండగా ఈ దారుణం జరిగింది. 10 మంది నిందితుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కొంతమంది మొదట మాపై అశ్లీల వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నా కాబోయే భర్తను కొట్టి, నన్ను బలవంతంగా కెనాల్ పక్కన జన సంచారం లేని గదిలోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు.
నా చెవి కమ్మలు, డబ్బులు తీసుకున్నారు’ అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. మొదట బాధితురాలు ఘటనపై ఫిర్యాదు చేయలేదు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో తన తల్లికి విషయాన్ని తెలియజేసింది. లైంగిక దాడి ఘటనను విపక్షాలు ఖండించాయి. నిందితుల్లో ఒక బీజేపీ యువనేత ఉన్నారని.. అతడికి ఒక ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్, తృణమూల్ ఆరోపించాయి.