e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 9,096 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం 9,096 కోట్లు

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.9,096 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7,703 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం అధికమని పేర్కొంది. గత త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.41,436.36 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.38,438.47 కోట్లుగా ఉన్నది.

  • కన్సాలిడేటెడ్‌ అడ్వాన్స్‌లు 14.7 శాతం పెరిగి రూ.12,49,331 కోట్లకు చేరుకున్నాయి.
  • నికర వడ్డీ ఆదాయం రూ.15,776.40 కోట్ల నుంచి 12 శాతం అధికమై రూ.17,684.40 కోట్లకు పెరిగింది.
  • బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.08 శాతం నుంచి 1.35 శాతానికి పెరిగినట్లు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. వీటి విలువ రూ.16,346.07 కోట్లుగా ఉన్నది. అలాగే నికర ఎన్‌పీఏ 0.40 శాతం లేదా రూ.4,755.09 కోట్లుగా ఉన్నాయి.
  • మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్‌ రూ.3,924.66 కోట్ల నిధులు వెచ్చించింది.
  • గడిచిన ఆరు నెలల కాలానికిగాను రూ.75,525.60 కోట్ల ఆదాయంపై రూ.16,564 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement