న్యూఢిల్లీ, ఆగస్టు 2: 90 శాతం కోచింగ్ సెంటర్లు రానున్న 10-15 ఏండ్లలో మూత పడతాయని సూపర్ 30 శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ అంచనా వేశారు. ‘ఈ రోజుల్లో చాలా మంది కోచింగ్ సెంటర్లలో మార్కెటింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులు వారికి క్లయింట్లయ్యారు’ అని ఆయన అన్నారు. ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన కంటెంట్‌తో ఆన్లైన్ తరగతులకు మంచి సిలబస్ ఇంకా తయారు కాలేదని.. అంకిత భావం గల టీచర్లు ఎవరైనా అలాంటి కంటెంట్ తయారు చేస్తే విద్యార్థులు ఇంట్లోనే కూర్చొని ఆ క్లాసులు వినడం ద్వారా ఆఫ్‌లైన్ క్లాసుల ద్వారా కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు.