Haryana | కాల్వలోకి దూసుకెళ్లిన పెండ్లి జీపు.. 9 మంది దుర్మరణం
హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
చండీగఢ్: హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 14 మందితో కూడిన బృందం పంజాబ్‌లోని ఫజిల్కాలో జరిగిన వివాహానికి హాజరై క్రూజర్‌లో తమ స్వస్థలాలకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో ఫతేహాబాద్‌లోని భాఖడా కాలువ దాటుతుండగా అదుపుతప్పిన జీపు బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయింది. దీంతో 9 మంది మంది చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతవగా, ఇద్దరు సజీవంగా ఉన్నారని జిల్లా సబ్‌కలెక్టర్ జగదీశ్ చంద్ర చెప్పారు.
గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు పదేండ్ల బాలిక, ఓ మహిళ ఉన్నారని వెల్లడించారు. కాలువలో నీటి ప్రవాహం తక్కువైతే గాలింపు సులభమవుతుందని, దీనికోసం నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

