లోయలో పడిన సుమో.. 9 మంది దుర్మరణం
Tata Sumo | జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) లోయలోకి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతిచెందారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) లోయలోకి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సురాన్‌కోట్‌కు చెందిన 13 మంది మోరాహ్లో జరిగిన ఓ పెండ్లివేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరిగి సురాన్‌కోట్‌కు టాటా సుమోలో బయలుదేశారు. అయితే బఫ్లియాజ్ వద్ద అదుపుతప్పిన సుమో.. లోయలోకి దూసుకెళ్లింది.

దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారని, మరో నలుగురు దావాఖానకు తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. సుమో 300 అడుగుల లోతులో పడిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

