అడుగుకో గుంత..
జిల్లాలోని రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్లతోపాటు జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు పూర్తిగా గతుకులమయంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసి నా రోడ్లన్నీ అడుగుకో గుంత.. అన్న చందంగా మారాయి.
- అధ్వానంగా మారిన రహదారులు
- వారం రోజులపాటు కురిసిన వానలకు దెబ్బతిన్న వికారాబాద్ జిల్లాలోని పలు రోడ్లు
- ఇబ్బందుల్లో వాహనదారులు, పాదచారులు
వికారాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): జిల్లాలోని రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామీణ రోడ్లతోపాటు జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు పూర్తిగా గతుకులమయంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసి నా రోడ్లన్నీ అడుగుకో గుంత.. అన్న చందంగా మారాయి. కంకర తేలి, గుంతలు పడి, వర్షం నీరు నిలిచి బురదమయంగా మారిపోయాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయి గుంతల ను తలపిస్తున్నాయి. గ్రామాలు, తండా ల్లో అయితే రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. కొన్ని రోడ్లు బురదతోపాటు పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో గుం తల రోడ్లపై అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతుండడంతో సమయానికి ఆసుపత్రులకు చేరుకోలేకపోతున్నారు. ప్రధానంగా వికారాబాద్-మోమిన్‌పేట వెళ్లే రహదారి, మోమిన్‌పేట-మర్పల్లి రోడ్డు, వికారాబాద్-కోట్‌పల్లి రోడ్డు, తాండూరు-పెద్దేముల్ వెళ్లే రోడ్లు, మోమిన్‌పేట-శంకర్పల్లి వెళ్లే రోడ్డు, నవాబుపేట మండల కేంద్రంలోని రోడ్లతోపాటు మెజార్టీ గ్రామాలకు వెళ్లే రహదారులు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి రోడ్డు, ధారూరు నుంచి నాగసముందర్ వెళ్లే రహదారి అయితే మరీ అధ్వానంగా తయారైంది. నవాబుపేట మండల కేంద్రంతోపాటు సమీపంలోని రోడ్డు ఘోరంగా తయారైంది. రోడ్డు అంతా కొట్టుకుపోగా కేవలం కంకరరాళ్లు, గుంతలతో నిండిపోయింది. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకుండా పెడచెవిన పెడుతుండడం గమనార్హం.
మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలోనూ రోడ్లు అన్ని అధ్వానంగా మారిపోయాయి. కొన్ని తండాలు, గ్రామాలకు వెళ్లే రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాలు వదిలేసి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా గ్రామాల్లోనూ మరీ దారుణంగా తయారైంది. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఎక్కడ చూసినా బురద, గుంతలతో దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో ఓ వైపు వర్షం నీరు నిల్వడం, బురద ఉండడంతోపాటు గుంతలు ఉండడంతో ముందుకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా మరమ్మతులపై పాలకులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

