8th Pay Commission | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్నాయి. ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్ చైర్మన్తో పాటు ఇద్దరు సభ్యులను నియమించనున్నది. ఉద్యోగులు, పెన్షనర్లు, ట్రేడ్ యూనియన్లు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో కేంద్రం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ సమావేశమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.