Uttar Pradesh | యూపీని ఠారెత్తిస్తున్న ఎండలు.. ఐదు రోజుల్లో 8,056 మరణాలు!
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది. (Uttar Pradesh) రెండవ అత్యంత ప్రభావిత రాష్ట్రమైన బీహార్‌లో 3,615, మధ్యప్రదేశ్‌లో 2,964, రాజస్థాన్‌లో 2,664 మరణాలు నమోదైనట్లు తెలుస్తున్నది.
కాగా, ఐదు రోజుల పాటు కొనసాగిన తీవ్ర వడగాల్పుల వల్ల దేశంలో దాదాపు 30,000 మరణాలు సంభవించినట్లు ఒక అధ్యయనం ద్వారా అంచనా వేశారు. ఇందులో ఉత్తరప్రదేశ్‌లోనే 8,000కు పైగా మరణాలు సంభవించి ఉంటాయని భావిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు దేశ జనాభాలో 43 శాతాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే వేసవి వడగాలుల మరణాల్లో 60 శాతానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావడం ఎండ తీవ్రత పరిస్థితులకు అద్దం పడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

