భువనేశ్వర్: ఒడిశా పోలీస్ శాఖ 187 హోంగార్డ్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నిర్వహించిన రాత పరీక్షకు ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రులు కూడా హాజరయ్యారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. బీజేపీ పాలిత రాష్ట్రంలో నిరుద్యోగుల దుస్థితి ఇలా ఉందని దుయ్యబట్టింది. చేతిలో డిగ్రీలు ఉన్నా, కొలువులు మాత్రం లేవంటూ ఎక్స్ పోస్ట్‌లో ఎద్దేవా చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ తీరు ఇలా ఉందని వ్యాఖ్యానించింది.
సంభల్‌పూర్‌లో ఈ నెల 16న జరిగిన ఈ పరీక్షకు సుమారు 8,000 మంది హాజరయ్యారు. అభ్యర్థులను అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను రప్పించాల్సి వచ్చింది. సంభల్పూర్లోని ఒక ఎయిర్ బేస్ రన్ వేపై వారికి పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది.