బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ (Congress) ఆధిక్యంలో కొనసాగుతున్నది. సీఎం బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రులు సీటీ రవి, అశోక్, సోమన్న, సుధాకర్, గాలి శ్రీరాములు, జార్క్హోలి ప్రత్యర్థులకంటే వెనుకబడిపోయారు. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారిన మంత్రులు సవాదీ, జగదీశ్ షట్టర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ముందంజలో ఉన్నారు.
ఇక బెంగళూరు, కోస్టల్ కర్ణాటకలో బీజేపీ అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతుండగా.. సెంట్రల్ కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, నార్త్ కర్ణాటక, మైసూరు రీజియన్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. మైసూరు ప్రాంతంలో బీజేపీ కన్నా జేడీఎస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్