కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు 8.23 లక్షలు
దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న క్రమంలో..ఆర్టీఐ సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కేంద్రంలో మంజూరైన ఉద్యోగాల్లో 8,23,656 లక్షలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లేవు.
- పోస్టులు మంజూరైనా భర్తీ చేయని కీలక విభాగాలు
- 21 శాతం కొలువులు ఖాళీగానే
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్న క్రమంలో..ఆర్టీఐ సమాచారం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. కేంద్రంలో మంజూరైన ఉద్యోగాల్లో 8,23,656 లక్షలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇందులో పబ్లిక్‌సెక్టార్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ లేవు. ఆర్టీఐలో వెల్లడైన వివరాల ప్రకారం మొత్తం మంజూరైన 39,23,212 పోస్టులకు గాను 2024 మార్చి 31 నాటికి 30,99,556 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మొత్తం మంజూరైన పోస్టుల్లో ఇంకా 21 శాతం ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కీలక విభాగాలు పోస్టులు మంజూరైనా వాటిని భర్తీ చేయట్లేదు.
సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ శాఖలోనే ఎక్కువ ఖాళీలు ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ఈ శాఖలో 5,56,248 ఉద్యోగాలు మంజూరు కాగా 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత రైల్వేశాఖలో 2,40,125 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిపై చంద్రశేఖర్ గౌర్ మాట్లాడుతూ.. ఉద్యోగం యువత హక్కు అని.. ఖాళీలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దాని వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ పనితీరు సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

