Tourist Bus | లోయలో పడిన టూరిస్టు బస్సు.. 9 మంది దుర్మరణం
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు.
చెన్నై: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 60 మంది పర్యాటకులు ఉన్నారని అధికారులు తెలిపారు. కూనూరు-వేటుపాళ్యం మద్య ఘాట్రోడ్డులో ఉన్న మూల మలుపు (Hairpin bend) వద్ద బస్సుపై డ్రైవర్ పట్టు కోల్పోయాడని (Lost control), దీంతో అది 50 అడుగుల లోతైన లోయలో పడిపోయిందని చెప్పారు. వారంతా ఊటికి (OoTy) వెళ్లి తెన్కాశీకి (Tenkasi) తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నదని జిల్లా ఎస్పీ కే. ప్రభాకర్ (SP K Prabhakar) చెప్పారు. దర్యాప్తులో పూర్తివిషయాలు తెలుస్తాయన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
కాగా, బస్సు ప్రమాద ఘటపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేల చొప్పులన అదింస్తామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

