ముంబై: దక్షిణ ముంబైలో 79 ఏళ్ల వృద్ధ మహిళ ఈవింగ్ వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ తెలియకుండాపోయింది. దీంతో ఆ వృధ్ధురాలి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే ఆమె మనువడు ఆ మహిళ ఆచూకీ పట్టేశాడు. వృద్ధ మహిళ మెడలో ధరించిన నక్లెస్కు జీపీఎస్(Necklace GPS) ట్రాకర్ ఉన్నది. ఆ ట్రాకర్ ద్వారా ఆమె ఎక్కడ ఉందో గుర్తించారు. వాకింగ్‌కు వెళ్లిన ఆ మహిళను ఓ టూవీలర్ ఢీకొట్టింది. దీంతో ఆ మహిళను స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
డిసెంబర్ 3వ తేదీన సెవరీ ఏరియాలో వృద్ధురాలు సైరా బి తాజుద్దిన్ ముల్లాను ఓ టూవీలర్ ఢీకొట్టింది. దీంతో ఆమెను కేఈఎం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె మనువడు మొహమ్మద్ వాసిమ్ అయ్యూ ముల్లా .. నక్లెస్‌లో ఉన్న జీపీఎస్ డివైస్‌ను యాక్టివేట్ చేశాడు. ఆ జీపీఎస్ ఆధారంగా కేఈఎం ఆస్పత్రిలో ఆ వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు.
జీపీఎస్ ఆధారంగా కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళ్లారు. ఆమె తలకు గాయమైంది. ప్రస్తుతం ట్రీట్మెంట్కు ఆమె స్పందిస్తున్నది.