అహ్మదాబాద్ : విమాన ప్రమాద మృతులను గుర్తించడానికి వారి బంధువుల నుంచి డీఎన్ఏ సేకరించామని, ఆ నమూనాలను సరిపోల్చడానికి 72 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
అది గుర్తించిన వెంటనే మృతదేహాలను వారివారి బంధువులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆరు మృత దేహాలను వారికుటుంబ సభ్యులకు అందజేసినట్టు పోలీసులు తెలిపారు. గురువారం పోస్ట్మార్గం నిమిత్తం 265 మృతదేహాలువచ్చాయన్నారు.