న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.900 కోట్ల విలువైన 90 కిలోల కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. న్యూఢిల్లీలోని నాంగ్లోయ్, పశ్చిమ ఢిల్లీలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన 82 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ కొరియర్ ఆఫీస్‌లో పట్టుకుంది. దీన్ని తెప్పించిన డ్రగ్ సిండికేట్‌కు విదేశాలతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీ, సోనిపట్‌లకు చెందిన కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో కూడా సుమారు రూ.5,620 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఢిల్లీలో పట్టుకున్నారు.
డ్రగ్స్ నిరోధక సంస్థలు శుక్రవారం గుజరాత్ తీరంలో సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 700 కిలోల మాదక ద్రవ్యాలను సీజ్ చేసి, 8 మంది ఇరానియన్లను అరెస్ట్ చేశాయి. భారత నేవీ భారత ప్రాదేశిక జలాల్లోని ఒక నౌకలో సోదాలు నిర్వహించి, అందులోని 700 కిలోల మెటాంఫెటమైన్ను సీజ్ చేసింది.