Accident | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (bus Collied With truck). ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కచ్ (Kachchh) ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కేరా ముంద్రా రోడ్డు (Kera Mundra Road)లోకి రాగానే ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Sonia Gandhi | ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
Rekha Gupta | ఒక్కరోజు కాలేదు.. అప్పుడే విమర్శలా..? ఆతిశీకి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కౌంటర్
DK Shivakumar | ఆ దేవుడి వల్ల కూడా కాదు.. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యపై డీకే శివకుమార్ వ్యాఖ్య