న్యూఢిల్లీ: భారత్లో విమాన ఇంజిన్ షట్డౌన్ ఘటనలు.. దాదాపు నెలకోసారి చోటుచేసుకుంటున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. విమాన ఇంజిన్లు ఆగిపోయిన ఘటనలు గత ఐదేండ్లలో 65 చోటుచేసుకున్నాయని, గత 17 నెలల్లో 11 మార్లు మేడే డిస్ట్రెస్ కాల్స్ (సాయం కోసం పైలట్ పంపే అత్యవసర సంకేతం) వచ్చాయని నివేదిక పేర్కొన్నది.
దీంట్లో నాలుగు ఫ్లైట్స్ హైదరాబాద్లో అత్యవసర ల్యాండింగ్ అయినట్టు తెలిసింది. ఆర్టీఐ దరఖాస్తుకు డీజీసీఏ ఈ డాటాను అందించింది. ఇండియన్ ఎయిర్లైన్స్ నడుపుతున్న విమానాల్లోని ఇంజిన్ లోపాల్ని నివేదిక బయటపెట్టింది.