పాట్నా: ఇద్దరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang Raped) ఆ తర్వాత ఆ బాలికను హత్య చేశారు. మృతదేహాన్ని నదిలో పడేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బీహార్లోని గయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించిన ఆరేళ్ల బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఒకచోటకు తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను చంపిన ఆ వ్యక్తులు ఆ చిన్నారి మృతదేహాన్ని సమీపంలోని మోర్హర్ నదిలో పడేశారు.
కాగా, బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఉచిర్వాన్ గ్రామంలోని మోర్హర్ నది ఒడ్డున బాలిక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బాలిక మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మారం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు తొలుత ఒక నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడ్ని కూడా అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించడంతో నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీసులు తొలుత పట్టుకున్న ఒక నిందితుడ్ని స్థానికులు కొట్టారు. ఆ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.