Madhypradesh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సిద్ధి జిల్లాలోని (Sidhi District) రేవా-సాత్నా సరిహద్దుల్లో (Rewa-Satna border) వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు (Truck) అదుపుతప్పి ఆగి ఉన్న రెండు బస్సులను (Two buses) ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ప్రమాదం ధాటికి ఒక బస్సు రెండు భాగాలుగా విడిపోగా, మరొకటి నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో 10 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రెండు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్ మహాకుంభ్ (Mahakumbh) పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
MP | At least 5 dead, 20 injured after a truck hit 3 buses that were stationed at roadside in Sidhi district. Buses were carrying people returning from Union HM Amit Shah's rally.
Incident happened due to a tyre burst in truck. 5 dead, injured rushed to hospital: DM Sidhi pic.twitter.com/OUGc5W9gqa
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 24, 2023
ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Singh Chouhan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశించారు.
MP| Rs 10 lakh ex-gratia amount to be given to families of those who have died in road accident in Sidhi district while Rs 2 lakh to be given to severely injured & Rs 1 lakh to moderately injured. Govt jobs to be given to next of kin of dead as per qualification: CM SS Chouhan
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 24, 2023