శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 22, 2020 , 15:07:54

దేశంలో కరోనా మరణాలు ఆరు, పాజిటివ్‌ కేసులు 341

దేశంలో కరోనా మరణాలు ఆరు, పాజిటివ్‌ కేసులు 341

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మన దేశంలోనూ పంజా విసుతున్నది. పాజిటివ్‌ కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా మరణాలు సంభవించాయి. ఆదివారం బీహార్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరింది.

మృతుల్లో 63 ఏండ్ల మహారాష్ట్ర వ్యక్తి, 38 ఏండ్ల బీహార్‌ వాసి ఉన్నారు. అయితే, ఆ ఇద్దరికి కూడా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో వారి శరీరాలు కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోలేక పోయాయని వైద్య అధికారులు చెప్పారు. మహారాష్ట్ర వ్యక్తికి బీపీ, షుగర్‌తోపాటు గుండె సంబంధ అనారోగ్యాలు ఉండగా, బీహార్‌ వాసి కిడ్నీ పేషెంట్‌ అని అధికారులు వెల్లడించారు.

ఇక మరణాల సంగతి ఇలా ఉంటే దేశంలో కరోనా కేసులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాటికి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 341కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)ప్రకటించింది.


logo