అహ్మదాబాద్: గుజరాత్లోని ఆరావళి జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. దైవదర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నవారిపై నుంచి కారు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. దాహోద్, ఆరావళి జిల్లాలకు చెందిన పలువురు బనాస్ కాంఠా జిల్లాలోని అంబాజీ ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆరావళి జిల్లాలోని కృష్ణాపూర్, మాల్పూర్ గ్రామాల మధ్య వేగంగా దూసుకోచ్చిన కారు వారిపైనుంచి వెళ్లింది. బలంగా ఢీకొట్టడంతో పలువురు అంత ఎత్తు ఎగిరి కిందపడిపోయారు. దీంతో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారు టైరు పేలడంతో అదుపుతప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై సీఎం భూపిందర్ పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడినవారికి నష్టపరిహారం ప్రకటించారు.
Gujarat | An Innova car mowed down people, who were going to Ambaji, after it suffered a tyre burst in Aravalli district. 6 people died while those injured were shifted to hospital: Sub-inspector, Malpur, Aravalli district https://t.co/jLcWU0VfjS pic.twitter.com/OUXBLePmHv
— ANI (@ANI) September 2, 2022