ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 58,924 కరోనా కేసులు, 351 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,98,262కు, మరణాల సంఖ్య 60,824కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 52,412 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,59,240కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 6,76,520 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.