Israeli airstrikes | గాజా నగరం (Gaza city)పై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు జరిపింది. వైమానిక దాడులతో (Israeli airstrikes) విరుచుకుపడింది. బుధవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో దాదాపు 50 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ (Khan Younis) నగరంపై ఇజ్రాయెల్ దళాలు రాత్రిపూట 10 విమానాలతో దాడులు జరిపారు. ఈ దాడుల్లో 54 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వందలాది మంది గాపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను నగరంలోని నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. మరోవైపు ఉత్తర, దక్షిణ గాజాపై బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 22 మంది చిన్నారులు సహా 70 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉన్న సమయంలో ఇజ్రాయెల్ దళాలు గాజాపై విరుచుకుపడటం గమనార్హం. కాగా, మంగళవారం ఇజ్రాయియెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గాలు లేవని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలతో కాల్పుల విరమణపై అవకాశాలు సన్నగిల్లాయి.
Also Read..
Israel-Gaza War | గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 70 మంది మృతి
Mukesh Ambani | ఖతార్ వేదికగా.. ట్రంప్‌తో ముఖేశ్ అంబానీ భేటీ