గాజా స్ట్రిప్: గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడిలో 22 మంది చిన్నారులు సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ పర్యటనలో ఉండగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం గమనార్హం.
అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం హమాస్ ఒక ఇజ్రాయెల్-అమెరికన్ బందీని విడుదల చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. కాగా, మంగళవారం ఇజ్రాయియెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గాలు లేవని పేర్కొనడంతో కాల్పుల విరమణపై అవకాశాలు సన్నగిల్లాయి.