Maoists | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో డివిజన్ కమిటీ సభ్యుడితో సహా 21 మంది మహిళలు, 31 మంది పురుషులు ఉన్నారు. వీరంతా సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్రసింగ్ నేగీ, బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎదుట గురువారం నాడు లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.45 కోట్ల మేర రివార్డులు ఉన్నట్లుగా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. వీరికి తక్షణసాయం కింద ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.