న్యూఢిల్లీ, మే 28: భారీ డ్రగ్స్ రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఛేదించారు. 9 మందిని అరెస్టు చేయడంతోపాటు 500 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 24న ఓ మహిళ జింబాంబ్వే నుంచి బెంగళూరులోని విమానాశ్రయానికి వచ్చింది. ఆమెను తనిఖీ చేయగా 7 కిలోల హెరాయిన్ దొరికింది.
ఆమె వెంట ఉన్న మరో మహిళను విచారించగా తాము విడిది చేసిన లాడ్జిలో ఓ బ్యాగు ఉన్నదని, అందులో హెరాయిన్ ఉందని చెప్పారు. తనిఖీ చేసిన అధికారులు మరో 7 కిలోల హెరాయిన్ సంచిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేయగా దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ను ఎలా సరఫరా చేస్తున్నారన్న విషయం బయటపడింది. 9 మందిని అరెస్టు చేసిన అధికారులు రూ.500 కోట్ల విలువైన 35 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.