రోజా ఎఫెక్ట్.. అక్కడ 50 శాతం తగ్గిన కరోనా వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సినేషన్| దేశవ్యాప్తంగా బుధవారం రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. దీంతో జమ్ముకశ్మీర్లో కరోనా వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. రోజా చేస్తుండగా టీకా తీసుకుంటే ఉపవాస దీక్షకు భంగం కలుగుందని ప్రజలు

శ్రీనగర్: దేశవ్యాప్తంగా బుధవారం రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. దీంతో జమ్ముకశ్మీర్లో కరోనా వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. రోజా చేస్తుండగా టీకా తీసుకుంటే ఉపవాస దీక్షకు భంగం కలుగుందని ప్రజలు అనుకుంటుండంతో వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మంచి నీరుకూడా తాగకుండా కఠిన ఉపవాస దీక్ష చేస్తారన్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య ఘననీయంగా తగ్గిందని వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో మంగళవారం 65 వేల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకోగా, నిన్న 31 వేల మంది మాత్రమే టీకా వేయించుకున్నారని తెలిపారు.
కాగా, వ్యాక్సిన్ తీసుకుంటే ఉపవాసానికి భంగం వాటిల్లినట్లు కాదనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని కుటుంబ సంక్షేమశాఖ డీజీ డాక్టర్ సలీమ్ రెహమాన్ వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మతపెద్దలు ఈ విషయంలో ఫత్వాలు జారీచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉపవాసదీక్ష చేస్తున్నవారు సైతం కొవిడ్ టీకా తీసుకోవచ్చని జమ్ముకశ్మీర్ గ్రాండ్ ముఫ్తీ నసీర్ ఉల్ ఇస్లామ్ వెల్లడించారు. ఉపవాసానికి వ్యాక్సిన్ ఎలాంటి భంగం కలిగించదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆన్లైన్లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివరీ అయ్యింది
ఆర్బీఐ అలర్ట్.. ఈ నెల 18న నిలిచిపోనున్న ఆర్టీజీఎస్ సేవలు
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
మహాత్మా ఏంటీ పరిస్థితి ?
ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
వ్యవసాయశాఖ మంత్రికి రెండోసారి కరోనా పాజిటివ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

