e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News ఆన్‌లైన్‌లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివ‌రీ అయ్యింది

ఆన్‌లైన్‌లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివ‌రీ అయ్యింది

ఆన్‌లైన్‌లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివ‌రీ అయ్యింది

లండ‌న్‌: ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఒక‌టి ఇస్తే.. మ‌రో వ‌స్తువు మ‌న ఇంటికి వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ప్రాడ‌క్ట్ ఇంటికి వ‌చ్చే వ‌ర‌కు టెన్ష‌న్ త‌ప్ప‌దు. కానీ బ్రిట‌న్‌లో జేమ్స్ అనే వ్య‌క్తిని అదృష్టం వ‌రించింది. ఆన్‌లైన్‌లో కొన్ని యాపిల్ పండ్ల కోసం ఆర్డ‌ర్ ఇవ్వ‌గా.. అత‌ని ఇంటికి ఆ పండ్ల‌తో పాటు యాపిల్ ఐఫోన్ కూడా వ‌చ్చింది. ట్వికెన్‌హామ్‌లో ఉండే 50 ఏళ్ల జేమ్స్ ఆ ఐఫోన్‌ను చూసి థ్రిల్ల‌య్యాడు. నిజానికి ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ఏదైనా ప్రాంక్ చేశారేమో అని భావించాడ‌త‌ను. కానీ టెస్కో మార్కెట్ కంపెనీ మాత్రం జేమ్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. యాపిల్ పండ్ల‌తో పాటు ఐఫోన్ స్పెష‌ల్ ఎడిష‌న్ ఫోన్‌ను గిఫ్ట్‌గా డెలివ‌రీలో పంపింది. టెస్కో గ్రోస‌రీ సంస్థ ప్ర‌మోష‌న‌ల్ క్యాంపేన్‌లో భాగంగా యాపిల్ పండ్ల‌తో పాటు ఐఫోన్‌ను ఆ క‌స్ట‌మ‌ర్‌కు డెలివ‌రీ చేసింది. సూప‌ర్ స‌బ్‌స్టిట్యూట్ ఆఫ‌ర్ పేరుతో ఆ గిఫ్ట్ ఇచ్చారు. యాపిల్ ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను టెస్కో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తోంది. నిక్ జేమ్స్ అదృష్ట‌వంతుడే అయినా.. అంద‌రి ప‌రిస్థితి ఇలా ఉండ‌ది క‌దా. ఎందుకంటే చైనాలో ఓ యువ‌తి యాపిల్ ఐఫోన్‌కు ఆర్డ‌ర్ ఇస్తే .. ఆమెకు యాపిల్ ఫ్లేవ‌ర్ డ్రింక్ వ‌చ్చింది. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌కు ఆర్డ‌ర్ ఇస్తే డ్రింక్ వ‌చ్చిన‌ట్లు ఆ యువ‌తి ఆరోపించింది.

Advertisement
ఆన్‌లైన్‌లో యాపిల్ పండ్లు కొంటే.. ఐఫోన్ డెలివ‌రీ అయ్యింది

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement