జనవరి 1న గుడిలో ప్రసాదం తిని.. 50 మందికి అస్వస్థత

బెంగళూరు: కొత్త ఏడాది తొలి రోజున దైవ దర్శనం కోసం గుడికి వెళ్లి ప్రసాదం తిన్న వారిలో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపుర తాలూకా బీరగనహళ్లిలోని గంగమ్మ ఆలయంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జనవరి 1న వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
కాగా, ప్రసాదం తిన్నవారిలో సుమారు 50 మందికి వాంతులయ్యాయి. దీంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రసాదం తిన్న మరి కొందరు ఈ విషయం తెలిసి ఆందోళనతో ఆసుపత్రికి చేరారు. దీంతో ఆ ఆరోగ్య కేంద్రం స్థానికులతో కిక్కిరిపోయింది. అయితే స్వల్ప లక్షణాలున్న వారికి డాక్టర్లు చికిత్స అందించి పంపారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆరోగ్య విభాగం అధికారులు ప్రసాదం శాంపిల్స్ను సేకరించి పరీక్ష కోసం పంపారు. ఆ ప్రాంతంలో తాగు నీటి పరిస్థితిపైనా ఆరా తీశారు. మరోవైపు ఈ ఘటనపై శ్రీనివాసపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో కొందరు స్థానికులను పోలీసులు ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

