ముంబై: మహారాష్ట్రలో దాదాపు 5 వేల మంది పాకిస్థానీలు నివసిస్తున్నారని, వీరిలో స్వల్ప కాలిక వీసాలు ఉన్న 1,000 మందిని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లవలసిందిగా ఆదేశించామని రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ శనివారం తెలిపారు. వీరిలో కొందరు గడచిన 8-10 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నారని, కొందరు ఇక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడగా మరికొందరు తమ పాకిస్థాన్ పాస్‌పోర్టును ప్రభుత్వానికి అప్పగించి, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు.
గుజరాత్‌లోని అహ్మాదాబాద్, సూరత్ నగరాలలో నిర్వహించిన వేర్వేరు దాడులలో మహిళలు, పిల్లలతోసహా 1,000 మందికిపైగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గుజరాత్ పోలీసులు నిర్బంధించారు.