లక్నో: కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. (Road Accident) మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో శ్రీనగర్-బెలాటల్ రోడ్డులోని ననోరా గ్రామం సమీపంలో వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. సుమారు 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడ్డాయి.
కాగా, బైక్పై ప్రయాణించిన ఇద్దరు, కారులో ఉన్న ముగ్గురు ఈ ప్రమాదంలో మరణించారు.
కారులో ప్రయాణించిన మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Watch: ఆహారం నాణ్యతపై స్పైస్ జెట్ ప్రయాణికులు ఆగ్రహం.. ఆ ఫుడ్ తినాలని సిబ్బందిని బలవంతం