న్యూఢిల్లీ: ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశీయులను (Bangladeshis) పోలీసులు అరెస్టు చేశారు. వారందరిని అక్రమ వలసదారులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితులంతా 20 నుంచి 25 ఏండ్ల వయస్సులోపువారేనని చెప్పారు. ఢిల్లీలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వారివద్ద బంగ్లాదేశ్‌కు సంబంధించిన పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కాగా, గురుగ్రామ్‌లో అక్రమంగా నివాసముంటున్న పది మంది బంగ్లా జాతీయులను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద లభించిన పత్రాలను బట్టి బంగ్లాదేశీయులుగా నిర్ధారించారు.