రాంచీ: జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ దవాఖానలో మంటలు అంటుకోవడంతో వైద్య దంపతులతోసహా ఐదుగురు మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్పిటల్ కారిడార్‌లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెండో అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు.
మృతులను డాక్టర్ హజారా, ఆయన సతీమణి డాక్టర్ ప్రేమ హజారాగా గుర్తించారు. మృతుల్లో వారి మేనల్లుడు కూడా ఉన్నారని చెప్పారు. హాస్పిటల్ కాంప్లెక్స్‌లోనే వారి ఇళ్లు కూడా ఉందని వెల్లడించారు. దవాఖానలోని రోగులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ధన్‌బాద్ డీఎస్పీ అర్వింద్ కుమార్ బిన్హా తెలిపారు.
#WATCH | Jharkhand: Five people, including a doctor and his wife, died in a fire in the residential complex of a hospital in Dhanbad. pic.twitter.com/pVEmV7Z5MW
— ANI (@ANI) January 28, 2023