శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు టూరిస్టులు మళ్లీ పహల్గామ్ బాటపట్టారు. (Tourists Return) ఆదివారం విదేశీయులతోపాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులతో ‘లిటిల్ స్విట్జర్లాండ్’గా పేరొందిన ఈ ప్రాంతం కళకళలాడింది. అయితే ఉగ్రదాడి జరిగిన బైసరన్ గడ్డి మైదానం ప్రాంతాన్ని మూసివేశారు.
కాగా, ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ను సందర్శించిన టూరిస్టుల్లో ఎలాంటి భయం కనిపించలేదు. ఉగ్రదాడుల వంటివి ఎక్కడైనా జరిగే అవకాశం ఉందని కొందరు తెలిపారు. ‘ఆ సంఘటన ముగిసిపోయిందని మేం భావిస్తున్నాం. అందుకే ఇక్కడకు రావాలని నిర్ణయించాం’ అని చెప్పారు. ట్రావెల్ ఏజెంట్లు, టూర్ గ్రూప్ మద్దతు ఉన్నందున తాము భయపడటం లేదని మహారాష్ట్రకు చెందిన ఒక బృందం తెలిపింది. ‘మనం భయపడాల్సిన పనిలేదు. ఏం జరుగాలో అది జరుగుతుంది’ అని ఆ గ్రూప్‌లోని ఒకరు అన్నారు.
మరోవైపు సుందర కశ్మీర్‌ను తాను పదోసారి సందర్శిస్తున్నట్లు క్రొయేషియాకు చెందిన టూరిస్ట్ తెలిపాడు. ప్రతిసారీ చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పాడు. ‘నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను. ఇక్కడ ఏ సమస్య లేదు. ప్రతిచోటా ప్రజలు పలుకరిస్తున్నారు. ఎవరిలో ఎలాంటి భయం లేదు’ అని అన్నాడు. ‘మీరు భయపడితే ఇంట్లోనే ఉండవచ్చు. కానీ అక్కడ కూడా అది జరగవచ్చు. ఇది (ఉగ్రదాడి) ఐరోపాలోనూ జరుగుతుంది. ఇది ప్రతిచోటా జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా పూర్తిగా సురక్షితమైన ప్రదేశం లేదు’ అని మరో విదేశీ టూరిస్ట్ పేర్కొన్నాడు.
🚨🇮🇳 Tourists begin RETURNING to Pahalgam following terror attack – media
आतंकी हमले के बाद पहलगाम लौट रहे पर्यटक – मीडियाpic.twitter.com/LonFzXWzxV
— Sputnik India (@Sputnik_India) April 26, 2025
Empty Pahalgam Welcomes first tourists after Baisaran terror attack. A large group of tourists arriving from Srinagar was seen enjoying themselves on the banks of the Lidder River in Pahalgam. Although they expressed initial fear due to recent events, the visitors decided to stay… pic.twitter.com/qYC8Hwmp0B
— IndiaToday (@IndiaToday) April 25, 2025