న్యూఢిల్లీ: ఏడుగురు జ్యుడిషియల్ ఆఫీసర్లు, ఇద్దరు న్యాయవాదులు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. వీరిలో జార్ఖండ్ హైకోర్టుకు నలుగురు, పాట్నా హైకోర్టుకు ఇద్దరు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ హైకోర్టులకు ఒక్కొక్కరిని నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ బుధవారం వెల్లడించింది. మధ్యప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పురుషేంద్రకుమార్ కౌరవ్ ఆ రాష్ట్ర హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ నేతృత్వంలోని కొలీజి యం.. హైకోర్టుల జడ్జిల నియామకానికి మే నుంచి 106 మంది పేర్లను సిఫారసు చేసింది. బుధవారం నియమితులైన వారి పేర్లు కూడా సిఫారసులో ఉన్నాయి.