Heavy Snowfall | భారీ హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజవణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో.. ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకుంది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో జాతీయ రహదారులు సహా 476 రోడ్లను అధికారులు మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోహ్‌తంగ, అటల్ సొరంగం వంటిచోట్ల 75 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండోలి, సిమ్లా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. నరకంద ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇల్లు, వాహనాలను మంచు కప్పేసింది. అక్కడ రోడ్లుకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్‌లో శుక్రవారం వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ ప్రాంతంలోనూ పెద్దఎత్తున మంచు పడుతోంది. జోషీమఠ్, బద్రినాథ్, కేదార్నాథ్, గంగోత్రి తదితర ప్రాంతాలు మంచు దుప్పట్లోనే ఉన్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్లోనూ భారీగా మంచు కురుస్తోంది. కాశ్మీర్ లోయలోని ఏ ప్రాంతంలో చూసినా హిమపాతమే కనిపిస్తోంది. శ్రీనగర్, రాజౌరి, సోన్మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్మార్గ్, పహల్గావ్ పర్యాటక రిసార్ట్లు మంచుతో నిండిపోయాయి. భారీగా కురుస్తున్న మంచు కారణంగా కశ్మీర్ ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
476 roads including 3 National highways closed due to snowfall in various parts of Himachal Pradesh: State Disaster Management Authority
Today’s lowest Minimum temperature in Himachal Pradesh is recorded at Keylong –8.3 °C. pic.twitter.com/37EVE89tlw
— ANI (@ANI) January 31, 2023
#WATCH | Himachal Pradesh: Narkanda in Shimla covered in a thick blanket of snow. pic.twitter.com/qtT3AGYZ6d
— ANI (@ANI) January 31, 2023
Himachal Pradesh | After fresh snowfall yesterday, Mandhol village of Shimla district covered in white sheet of snow pic.twitter.com/05UqjKOzN7
— ANI (@ANI) January 31, 2023