న్యూఢిల్లీ: చత్తీస్‌ఘడ్‌లో నక్సల్ హింస(Naxal Violence) 47 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 2010 నాటితో పోలిస్తే, 2024లో నక్సల్ హింస వల్ల పౌరులు, భద్రతా సిబ్బంది మృతుల సంఖ్య కూడా 64 శాతం తగ్గినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇవాళ లోక్‌సభలో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు. 2024లో చత్తీస్‌ఘడ్‌లో వామపక్ష తీవ్రవాదం కేసులు 267 నమోదు అయినట్లు ప్రభుత్వం చెప్పింది. 2010లో ఆ సంఖ్య 499గా ఉన్నట్లు వెల్లడించారు. పౌరులు, భద్రతా దళాల సంఖ్య 2010లో 343 ఉండగా, గత ఏడాది ఆ సంఖ్య 122కు తగ్గినట్లు తెలిపారు. గడిచిన అయిదేళ్లలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 1925 కోట్ల నిధుల్లో 43 శాతాన్ని అందజేసినట్లు మంత్రి చెప్పారు.