ADR | దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. 28 రాష్ర్టాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.
రాష్ట్రం ఎమ్మెల్యేల శాతం
ఆంధ్రప్రదేశ్ 79%
కేరళ 69%
తెలంగాణ 69%
బీహార్ 66%
మహారాష్ట్ర 65%
తమిళనాడు 59%