న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఫ్), అస్సాం రైఫిల్స్, ఎన్ఎస్జీల్లో 2023-2025 మధ్య కాలంలో 438 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారని మంగళవారం కేంద్రం లోక్‌సభలో తెలిపింది. ప్రమాదవశాత్తు జరిగిన కాల్పుల్లో కొందరు సిబ్బంది ఏడు మంది తోటి సైనికులను చంపారని వెల్లడించింది. సీఆర్పీఫ్లో అత్యధికంగా(159) ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి.
2014-2025 మధ్య కాలంలో సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో 23,360 మంది తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇందులో బీఎస్ఎఫ్లో ఎక్కువ మంది(7,493) మంది రాజీనామా చేశారు. సాయుధ బలగాలకు రోజుకు 8 గంటల పని విధానం అమల్లో ఉందని కేంద్రం తెలిపింది.