కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 26: 41 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇందులో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డులు ఉన్నాయని, వీరిలో 12 మంది మహిళా సభ్యులు ఉన్నట్లు వివరించారు. మరోవైపు సుక్మా జిల్లా అడవుల్లో మావోయిస్టుల భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.