చండీగఢ్: కొవిడ్-19తో బాధపడుతూ ఓ వ్యక్తి (40) చండీగఢ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల, దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందినవారు.
లూధియానా వైద్యులు ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు చెప్తూ, చండీగఢ్‌కు పంపించారని అధికారులు చెప్పారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని మంగళవారం నిర్ధారణ అయిందన్నారు. ఇటీవల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.