కోల్‌కతా: పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) బంగ్లాదేశ్‌ను హెచ్చరించారు. బెంగాల్లో 40 రాఫెల్స్ ఉన్నాయన్న ఆయన ఆ దేశంపై దాడికి రెండు సరిపోతాయని అన్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హట్‌లో బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఘోజదంగా వద్ద పలు హిందూ సంఘాలతోపాటు బీజేపీ మంగళవారం నిరసన చేపట్టింది.
కాగా, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారి ఈ నిరసనకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బంగ్లాదేశ్‌పై మండిపడ్డారు. భారత్‌పైనే బంగ్లాదేశ్ ఆధారపడిందని అన్నారు. 97 ఉత్పత్తులను పంపకపోతే మీకు కూడు, గుడ్డ ఉండవని విమర్శించారు. అలాగే జార్ఖండ్ నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తు సరఫరా చేయకపోతే బంగ్లాదేశ్‌లోని 80 శాతం గ్రామాలు చీకట్లో మగ్గుతాయని అన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆపకపోతే రాఫెల్ యుద్ధ విమానాలను పంపుతామని సువేందు అధికారి హెచ్చరించారు. ‘హసిమారాలో 40 రాఫెల్ విమానాలు ఉన్నాయి. కేవలం రెండు విమానాలు పంపితే ఆ పని పూర్తి అవుతుంది’ అని అన్నారు. అలాగే బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని తాలిబాన్‌తో పోల్చారు. ‘ఉగ్రవాద, రాడికల్, మానవ వ్యతిరేక’ ప్రభుత్వంగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా డిసెంబరు 16న పెద్ద సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.