బెంగుళూరు : ఢిల్లీ తరహాలోనే ఇవాళ బెంగుళూరులోని స్కూళ్ల(Bengaluru Schools)కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. సిటీలోని సుమారు 40 ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించాయి. ఆర్ఆర్ నగర్‌తో పాటు కేన్గిరిలో ఉన్న స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. పోలీసులు తక్షనమే స్కూళ్ల వద్ద తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇవాళ ఢిల్లీలో కూడా 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.